Gold Price Today: బంగారం ధరలు ఇటీవల కాలంలో భగ్గుమన్న విషయం తెలిసిందే. నాన్-స్టాప్‌గా రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు, ఒకానొక దశలో లక్షా 30 వేల మార్కు దాటాయి. అయితే, ఆ తర్వాత మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో, ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో, మన దేశంలో కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఈ మంగళవారం (నవంబర్ 04, 2025) ఉదయం నమోదైన ధరల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఏకంగా రూ.710 మేర తగ్గింది.
ఈ రోజు ధరలు (నవంబర్ 04, 2025)
* 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.710 తగ్గి రూ.1,22,460గా ఉంది.
* 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.650 తగ్గి రూ.1,12,250గా ఉంది.
* వెండి (కిలో): రూ.3000 తగ్గి రూ.1,51,000లుగా ఉంది.
హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే..
తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్‌లో:
* 24 క్యారెట్ల (10 గ్రాములు): రూ.1,22,460
* 22 క్యారెట్ల (10 గ్రాములు): రూ.1,12,250
* కిలో వెండి: రూ.1,65,000 లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో:
* 24 క్యారెట్ల (10 గ్రాములు): రూ.1,22,460
* 22 క్యారెట్ల (10 గ్రాములు): రూ.1,12,250
* కిలో వెండి: రూ.1,65,000 లుగా ఉంది.
బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్, రాష్ట్ర పన్నులు, రవాణా ఖర్చుల వంటి అంశాలను బట్టి ధరల్లో చిన్న తేడాలు ఉంటాయి.

