Ramesh Tawadkar: గోవా అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న రమేశ్ తవాడ్కర్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవి లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంత్రివర్గంలో చోటు కల్పించడంతో తవాడ్కర్ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. రాజకీయంగా ఇది ఒక వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. ఇటీవల పర్యావరణ శాఖ మంత్రి అలెక్సియో సికెరియా రాజీనామా చేయడంతో, ఆ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్‌కు, అలాగే మాజీ మంత్రి గోవింద్ గౌడే స్థానంలో తవాడ్కర్‌కు మంత్రి పదవులు దక్కాయి.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu: రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన.. నేడు క్యాబినెట్ కీలక భేటీ
స్పీకర్‌గా కొనసాగాలని తాను భావించినప్పటికీ, పార్టీ ఆదేశాల మేరకు మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి అంగీకరించానని రమేశ్ తవాడ్కర్ స్వయంగా మీడియాకు తెలిపారు. పార్టీ నిర్ణయమే తనకు ముఖ్యమని ఆయన అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, దిగంబర్ కామత్ మరియు రమేశ్ తవాడ్కర్‌లు ఇద్దరూ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.