Game Changer OTT: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ దీన్ని తెరకెక్కించడంతో ఈ సినిమాపై కొండంత అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. కానీ ఈ సినిమా ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ ని మూటగట్టుకొని అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. నిర్మాత దిల్ రాజుకి భారీ నష్టాలను మిగిల్చింది. అయితే ఓటీటీలో అలరించేందుకు ఈ సినిమా ఇప్పుడు రెఢీ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా ఫిబ్రవరీ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సిల్వర్ స్క్రీన్ పై ఫెయిల్ అయిన చాలా సినిమాలు కూడా ఓటీటీలో సత్తా చాటాయి. మరి గ్లోబల్ స్టార్ గేమ్ ఛేంజర్ కూడా ఓటీటీలో సత్తా చాటుతుందో లేదో చూడాలి.
