Venkaiah Naidu: అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు బయోపిక్ ను ‘ఘంటసాల ది గ్రేట్’ పేరుతో తెరకెక్కించారు సిహెచ్ రామారావు. ఇందులో ఘంటసాల గా కృష్ణ చైతన్య నటిచంగా, సావిత్రమ్మ గా కృష్ణ చైతన్య భార్య మృదుల నటించారు. ఈ చిత్రాన్ని సిహెచ్ ఫణి నిర్మిచారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి, నిర్మాత, నటుడు అశోక్ కుమార్, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్, నటుడు అశోక్ కుమార్, సుబ్బరాయశర్మ, జయవాణి, దామోదర ప్రసాద్, కర్రి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక దృక్కోణంతో కాకుండా సామాజిక చైతన్యం కలిగించేలా ఈ సినిమాను రూపొందించిన దర్శక నిర్మాతలను వెంకయ్య నాయుడు అభినందించారు. సంగీతం ఉన్నంత కాలం ఘంటసాల ఉన్నారని ఆయన అన్నారు.
