Gary Kirsten: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి గ్యారీ కిర్‌స్టన్ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పాక్ పరిమిత ఓవర్ల జట్లు ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లనుండగా.. కిర్‌స్టన్ జట్లతో పాటు ఆయా దేశాలకు వెళ్లడం లేదని తెలుస్తుంది. కిర్‌స్టన్ పాక్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగడానికి ఆటగాళ్లతో ఏర్పడిన విభేదాలు కారణమని సమాచారం. పాక్ హై పెర్ఫార్మెన్ కోచ్‌గా డేవిడ్ రీడ్‌ను నియమించాలని పాక్ క్రికెట్ బోర్డును కోరగా, అందుకు పీసీబీ ఒప్పుకోలేదని తెలుస్తుంది. కిర్‌స్టన్ వైదొలగడానికి ఇదీ ఒక కారణమని సమాచారం. ఒకవేళ కిర్‌స్టన్ పాక్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగితే అతని స్థానాన్ని టెస్ట్ జట్టు హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్పీ లేదా జతీయ సెలెక్టర్ ఆకిబ్ జావిద్ భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

