Ganesh: కన్నడ చిత్రసీమ ముద్దుగా గోల్డెన్ స్టార్ అని పిలుచుకునే గణేశ్ నటించిన ‘కృష్ణం ప్రణయ సఖి’ ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ఓ సరికొత్త వార్తను తన అభిమానులతో పంచుకున్నారు. తన తదుపరి చిత్రాన్ని కొరియోగ్రాఫ్ బి. ధనంజయ డైరెక్ట్ చేస్తారని, ఈ సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మించబోతున్నానని అన్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: తోలు తీసి కింద కూర్చో పెడతా
Ganesh: యూనిక్ అండ్ లార్జర్ దాన్ లైఫ్ స్టోరీగా ఇది ఉండబోతోంది. గోల్డెన్ స్టార్ గణేశ్ ప్రాజెక్ట్ లో భాగస్వామి కావడం పట్ల టీజీ విశ్వప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగులో మాదిరిగానే కన్నడ చిత్రసీమలోనూ విజయకేతనం ఎగరువేస్తామనే ఆశాభావాన్ని ప్రకటించారు.
మరోసారి తెరపైకి ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’!
Accidental Prime Minister: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పొలిటికల్ లైఫ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ మూవీ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రను ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ పోషించారు. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ ను నెగెటివ్ షేడ్స్ లోనే చూపించారనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. అయితే మన్మోహన్ మరణానంతరం అనుపమ్ ఖేర్ ఆయన్ను కీర్తిస్తూ పెట్టిన పోస్ట్ పై పలువురు మండిపడుతున్నారు. అందులో ప్రముఖ రచయిత వీర్ సింఘ్వీ కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Perni Nani: ఇప్పటికీ అజ్ఞాతంలోనే మాజీ మంత్రి పేర్ని నాని ఫ్యామిలీ
గతంలో ఆయన మన్మోహన్ సింగ్ ను విమర్శినవారే. దానిని అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేస్తూ ‘నో కామెంట్’ అని పెట్టారు. ఈ సినిమాకు రచన చేసిన హన్స్ లాల్ మెహతా… వీర్ సంఘ్వీ వ్యాఖ్యలను బలపర్చడాన్ని అనుపమ్ తప్పు పట్టారు. ఇలాంటి డబుల్ స్టాండర్స్డ్ కరెక్ట్ కాదని హితవు పలికారు. మొత్తానికి మన్మోహన్ మరణానంతరం కూడా ఆయనపై వచ్చిన సినిమా సోషల్ మీడియాలో రచ్చకు కారణంగా మారింది.