Perni Nani: పేర్నినాని పరిచయం అవసరం లేని నాయకుడు… జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనదైన శైలిలో అధికారదర్పం ప్రదర్శించడమే కాదు. టీడీపీ, జనసేన పార్టీ నేతలపై మాటలతో విరుచుకుపడటమే కాకుండా… పవర్ ప్రతాపం కూడా పరోక్షంగా చూపించారనడంలో ఎటువంటి సందేహాం లేదు. వాక్ చాతుర్యంతో సూక్తులు చెపుతూ ఎదుటువారిని వేలెత్తి చూపించే పేర్నినాని కనిపించకుండా అడ్డగోలు వ్యవహారులు కూడా చేశారు.
పేదల పొట్ట నింపాల్సిన బియ్యం అక్రమార్కుల చెంతకు చేరడంపై కూటమి ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ప్రభుత్వం కొద్ది రోజులు హాడావిడి చేస్తుందని అందరూ అనుకున్నారు. క్రమంగా రేషన్ బియ్యం మాఫీయాకు చెక్క పెట్టెందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం క్షేత్రస్ధాయిలో అడుగు పెట్టారు. కాకినాడలో పవన్ పర్యటనతో పీడీఎస్ రైస్ ఎక్స్‌పోర్టుతో సంబంధాలున్న వారంతా ఖంగుతిన్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని సైతం చాలా చాకచక్యంగా బియ్యం వివాదం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు.
Perni Nani: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని సతీమణి జయసుధ పేరున నిర్మించిన గోడౌన్‌ను సివిల్ సప్లయిస్ కార్పోరేషన్‌కు అద్దెకిచ్చారు. ఆ అగ్రిమెంట్ కూడా సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ అవసరమైనప్పుడు రైస్‌ను అందులో నిల్వచేసుకుని అద్దె చెల్లించేవారు.గోడౌన్ మాత్రం పేర్ని నాని చేతిలోనే ఉండే విధంగా చేసుకున్నారు. నాడు పవర్ చేతిలో ఉంది కాబట్టి అధికారులు నో చెప్పకుండా అలాగే చెశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పీడీఎస్ రైస్ ఎక్స్ పోర్టుపై ఉక్కపాదం మోపుతోంది. ఇదంతా ప్రభుత్వం మొదట్లోనే హాడావిడి చేసిన తర్వాత ఏమీ ఉండదని అందరూ భావించారు. కాని అందుకు భిన్నంగా కూటమి సర్కార్ రైస్ మాఫీయాపై కన్నెర్ర చేస్తోంది. చివరకు ఒకానొకదశలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు చేరుకుని అక్కడ పరిస్ధితులపై మండిపడ్డారు. దీంతో రాష్ట్రంలో రైస్ మాఫియా గుండెల్లో దడ పుట్టింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తన చాకచక్యానికి పదును పెట్టారు.
Perni Nani: తన గొడౌన్‌లో సుమారు రూ. 2 వేల బస్తాలు మాయమైయ్యాయి. ఏలా మాయమైయ్యాయో తెలియడం లేదు. నా గోడౌన్‌లో పోయాయి కనుక ఆ నష్టమెంతో చెపితే నేను చెల్లించేస్తానంటూ చాలా తెలివిగా రెవిన్యూ అధికారులకు ఒక లేఖ రాశారు. ఇక్కడ పేర్ని తన చాతుర్యతను చాటుకున్నారు. పెనాల్టీ కట్టించుకుంటే ఏ గొడవ ఉండదు. లీగల్‌గా కూడా సేప్ అనుకున్నారు… కాని పేర్ని లేఖ బూమ్ రాంగ్ అయ్యింది.
నవంబర్ 26న మాజీ మంత్రి పేర్ని నాని తన గోడౌన్‌లో బియ్యం మాయమైయ్యాయని లేఖ రాశారు. సరిగ్గా నెల రోజుల తర్వాత అధికారులు పేర్ని గోడౌన్‌లో మాయమైన బియ్యం లెక్కలు తేల్చారంటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముందులో 3708 బస్తాలని చెప్పిన అధికారులు, కాదు కాదు 4840 బస్తాలన్నారు. కాదు మొత్తం 7577 బస్తాలని అధికారులు మరోసారి లెక్కలు చెప్పారు. స్వయంగా పేర్నినాని బియ్యం మాయమైయ్యాయని చెపితే ఆ బస్తాలు తెల్చడానికి అధికారులకు నెలరోజుల పట్టిందంటే ఒక్కసారి పేర్నినాని చక్రం ఏస్ధాయిలో తిప్పుతున్నారో అర్దం చేసుకోవచ్చు.
Perni Nani: మరోవైపు సివిల్ సప్లయిస్ అధికారులు డిసెంబర్ 10న పేర్ని జయసుధపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేరోజు కేసు నమోదు చేసిన నేటికి ఏ ఒక్కరని పోలీసులు విచారించలేదు. కేసు నమోదు అవ్వగానే పేర్ని జయసుధ అజ్ఞాతంలోకి వెళ్లిపోతే… గోడన్ మేనెజర్ మానసతేజ సైతం పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు పెద్దగా ప్రయత్నాలు చేసిన పరిస్ధితి కనిపించడం లేదు. మరోవైపు పేర్నినాని అతని కుమారుడు కిట్టు ఊరులో ఉన్నంత సేపు నోటీసులు ఇవ్వని పోలీసులు వారు వెళ్లిపోయాక ఇంటికి నోటీసులు అంటించారు. ఇక్కడ పోలీసులు పనితీరుపై కూడా ప్రజలు పెదవి విరుస్తున్నారు.
ఈ ఎపిసోడ్‌లో అధికారులు అలక్ష్యమా లేక కూటమి ప్రభుత్వం మౌనమో పేర్నినాని కుటంబానికి వరంగా మారిందని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఈ బియ్యం మాయంలో దొంగలు ఎవరనేది తేల్చుతారో లేక చాపకింద నీరులా చల్లబర్చేస్తారో వేచిచూడాలి.
రాసినవారు: మురళీ మోహన్
ఏపీ బ్యూరో చీఫ్
అమరావతి