Cricket: ఓటమికి కారణం బ్యాటర్లే.. టీమ్ ఇండియా పై ఫైర్ అయిన గంభీర్

Cricket: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌పై దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా బ్యాటింగ్ పూర్తిగా విఫలమవడంతో మ్యాచ్ రెండురోజుల్లోనే ముగిసిపోయింది.

ఈ పరాజయంపై భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించాడు. పిచ్‌ను కారణం చెప్పే వ్యాఖ్యలను స్పష్టంగా తోసిపుచ్చాడు

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ మాట్లాడుతూ “పిచ్‌లో ఎలాంటి తప్పు లేదు. మేం కోరినట్టే క్యురేటర్ పిచ్ ఇచ్చాడు.”

 

“ఇలాంటి వికెట్‌పై సరిగ్గా ఆడకపోతే ఫలితాలు ఇలానే ఉంటాయి.”

 

“బ్యాటర్ల టెక్నిక్, టెంపర్మెంట్ టెస్ట్ అయ్యే పిచ్ ఇది.”

 

 

అంతేకాక, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోవడం

గంభీర్ ఆవేదనలో“123 పరుగులు సాధారణ స్కోరే. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం అంగీకరించలేని విషయం.”“పిచ్‌లో ఎలాంటి దెయ్యాలు లేవు. అక్షర్ పటేల్, బవుమా పరుగులు చేశారు కదా? మరి మిగతావారెందుకు విఫలమయ్యారు?”

“స్పిన్నర్లకోసం పిచ్ కాదు, సీమర్లు ఎక్కువ వికెట్లు తీశారు.” “పిచ్‌ను నిందించడం ఆపాలి. మన టెక్నిక్ ని సరిచేసుకోవాలి.”

కేఎల్ రాహుల్, టెంబా బవుమా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు పటిష్టమైన డిఫెన్స్‌తో ఆడారని, మిగిలిన బ్యాటర్లు ఆ స్థిరత్వాన్ని చూపలేకపోయారని గంభీర్ విమర్శించాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *