Bigg Boss 9: బిగ్‌బాస్ సీజన్ 9లో ఆట మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఐదో వారం నాటికి హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా కళ్యాణ్ పడాల ఎన్నికయ్యాడు. మొదట్లో “వరస్ట్ ప్లేయర్” అని విమర్శలు ఎదుర్కొన్న కళ్యాణ్, తన తెలివి, గేమ్‌ప్లేతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రెండు వారాలుగా క్రమంగా తన ఆటను మెరుగుపరుచుకున్న కళ్యాణ్, చివరికి కెప్టెన్సీ టాస్క్‌లో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇప్పటివరకు నాలుగు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీల సమయం దగ్గరపడింది. ఈ వారం బిగ్‌బాస్ వరుస టాస్క్‌లతో హౌస్ మేట్స్‌కు గట్టి పరీక్ష పెట్టాడు. ఇమ్యూనిటీ గెలుచుకోవాలంటే డేంజర్ జోన్ నుంచి బయటపడాలని టాస్క్ ఇచ్చాడు. ఇందులో తనూజ చేసిన త్యాగం వల్ల కళ్యాణ్ సేవ్ అయ్యాడు, దీనితో ఇద్దరి మధ్య బంధం బలపడింది. అయితే, ఆటలో వ్యూహాలు, భావోద్వేగాలు కలిసిపోయి హౌస్‌లో చర్చలకు దారితీశాయి.
బిగ్‌బాస్ ఇచ్చిన “ఫైట్ ఫర్ సర్వైవల్” టాస్క్ హౌస్‌లో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. గార్డెన్ ఏరియాలో నీటితో నిండిన పూల్స్‌లో కంటెస్టెంట్స్ పడుకోవాల్సి వచ్చింది. ఎవరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో, వాళ్ల టబ్‌లోని నీటిని తీసి ఇతరుల టబ్‌ల్లో పోయాలి అనే రూల్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో ఫ్లోరా సంచాలక్‌గా వ్యవహరించగా, సుమన్ శెట్టిపై చిన్న పొరపాటు కారణంగా అన్యాయం జరిగిందని అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. “సపోర్ట్ తీసుకున్నావు” అంటూ ఫ్లోరా అతడిని గేమ్ నుంచి తీసేయడంతో, సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read: Trisha: నా హనీమూన్ కి ప్లాన్ చేయండి
టాస్క్ సమయంలో తనూజ “నాకు వాటర్ ఫోబియా ఉంది” అంటూ భరణి దగ్గర కన్నీరు పెట్టుకుంది. అయితే, చివరికి ఆమె ధైర్యంగా పాల్గొని టాస్క్‌లో విజయం సాధించింది. ఈ సంఘటన తర్వాత దివ్య, తనూజల మధ్య ఉన్న దూరం కొంత తగ్గినట్లు కనిపించింది.
“కనుక్కోండి చూద్దాం” అనే కెప్టెన్సీ టాస్క్‌లో కంటెస్టెంట్స్ కళ్లకు గంతలు కట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. బజర్ మోగినప్పుడు ఎవరో ఒకరి లైట్ ఆఫ్ చేయాలి, ఆ లైట్ ఆఫ్ అయిన వ్యక్తి ఎవరు చేశారో కనుక్కోవాలి. తప్పు చెబితే రేస్ నుంచి ఔట్.
ఈ టాస్క్‌లో రాము, భరణి, దివ్య అవుట్ అవ్వగా, చివరికి కళ్యాణ్, తనూజ ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నారు. హౌస్ మేట్స్ ఓటింగ్‌లో కళ్యాణ్ ఎక్కువ మద్దతు పొంది కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు.
తనూజ చేసిన త్యాగం, కెప్టెన్సీ ఫలితంతో హౌస్‌లో కొత్త వాతావరణం నెలకొంది. దివ్య, తనూజ క్షమాపణను అంగీకరించకుండా “నాకెవరి సపోర్ట్ వద్దు” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. మరోవైపు ఇమ్మాన్యుయేల్, భరణి, దివ్య కలిసి కళ్యాణ్‌పై వ్యూహాలు వేస్తున్నారు. మొత్తం మీద బిగ్‌బాస్ 9 ఐదో వారం ఉత్కంఠతో సాగుతోంది. కళ్యాణ్ కెప్టెన్సీ తర్వాత హౌస్‌లో కొత్త గ్రూపులు, కొత్త గేమ్ ప్లాన్లు మొదలయ్యాయి. రాబోయే ఎపిసోడ్ల్లో ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు డేంజర్ జోన్లో పడతారో చూడాలి.