Mad Square: నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ ల కలయికలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “మ్యాడ్”. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ ని కూడా తీసుకొస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ అంటూ వస్తున్న ఈ సినిమా నుంచి పలు సాంగ్స్ విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.
Also Read: Chiranjeevi: ట్రెండింగ్‌లో చిరంజీవి.. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్
తాజాగా మేకర్స్ ముగ్గురు ఫ్రెండ్స్ పై సాలిడ్ మాస్ నెంబర్ ని రిలీజ్ చేశారు.వచ్చార్రోయ్ అంటూ సాగే ఈ పాటని జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ అందించడం విశేషం. ముగ్గురి హీరోలపై లిరిక్స్ మాత్రం అదిరిపోయాయినే చెప్పాలి. ఇక ఈ పాటకి భీమ్స్ సంగీతం అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇలా ఈ ముగ్గురు యంగ్ హీరోలు మళ్ళీ ఆడియెన్స్ ని ఎంటెర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మిస్తుండగా మార్చ్ 28న సినిమా రిలీజ్ కి రాబోతుంది.
మ్యాడ్ స్క్వేర్ వచ్చరోయ్ లిరికల్ సాంగ్ :

