Free Bus:ఆధార్ తంటాలు ఇంతింత కాదయా.. ఫ్రీ బస్ గోలలు ఎంతెంత చూడయా.. అని పాడుకోవాలనిపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలకు ఉచిత బస్ పథకం అమలు చేస్తున్నది. ఈ పథకంలో భాగంగా ఆధార్ కార్డు చూపితే రాష్ట్రంలో పరిమిత బస్సుల్లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కానీ, కొందరు కండక్టర్ల వింత పోకడలతో మహిళలు అవస్థల పాలవుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా భైంసా వద్ద తాజాగా ఓ ఘటన ప్రయాణికులకే అవస్థలు తెచ్చిపెట్టింది.
Free Bus:భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మహిళలు ఎక్కారు. ఆధార్ కార్డు అప్డేట్ కాలేదని ఆ బస్సు కండక్టర్ ఫ్రీ టికెట్ ఇవ్వలేదు. ఎందుకివ్వరని మహిళలు నిలదీయగా, ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని పాత చిరునామా ఉన్నది. అది అప్డేట్ కాలేదని తేల్చి చెప్పాడు. దీంతో కండక్టర్‌తో మహిళలు వాగ్వాదానికి దిగగా, దేగామ్ గ్రామం వద్ద బస్సును అరగంటపాటు నిలిపివేశారు.
Free Bus:ఈ సమయంలో ప్రయాణికులకు, కండక్టర్‌కు నడుమ వాగ్వాదం చోటుచేసుకున్నది. ప్రభుత్వం నుంచి పొందిన ఆధార్ కార్డులు ఎందుకు చెల్లవని మహిళలు భీష్మించుకున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా, గ్రామం, మండలం తెలంగాణలోనివే కదా.. అని మరికొందరు ప్రయాణికులు కండక్టర్‌కు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.