Telangana: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు విషయమై ప్రజాభిప్రాయ సేకరణ ఉండగా, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు బీఆరెస్ నేతలను ఎక్కికక్కడ అరెస్టులు చేశారు. పరిశ్రమ ఏర్పాటును ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నందున, ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటారని వారిని అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
Telangana: నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తుండగా నకిరేల్ మాజీ ఎమ్మల్యే చిరుమర్తి లింగయ్యను, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ను చిట్యాల శివారులో కార్లలో వెళ్తుండగా అరెస్టు చేశారు. తమ అరెస్టులను మాజీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా రేవంత్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

