Formers Death: ఆరుగాలం కష్టించి, పంటను కాపాడి, రాశి పోసి కుప్పనూర్చాడు. పొద్దంతా ఆ రాశిని ఎండనేర్పుతూ పొద్దంతా ఆ వడ్ల రాశి వద్దే ఉన్నాడు. తీవ్ర వడదెబ్బ సోకి వడ్ల రాశిపైనే పడి ప్రాణాలొదిలాడు. హృదయ విదారకమైన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఈ ఘటనతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై దుఃఖసాగరంలో మునిగిపోయారు. తోటి రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
Formers Death: దేశానికి అన్నంపెట్టే రైతన్న కష్టాలు ఇప్పటికీ కొందరికి తెలియవు. ఎండనకా, వాననకా, చలికి వణుకుతూ ఆరుగాలం పొలం పనుల్లో మగ్గిపోతాడు రైతన్న. అలాంటి రైతు పురుగు, బుట్టా ఉంటదేమోననే భయంలేకుండా పొలాన్ని అపురూపంగా పెంచుకుంటారు. తీరా పంట పండిన తర్వాత కూడా ఒక్కోసారి ప్రకృతి ప్రకోపిస్తే ఆ రైతు తీరని నష్టానికి గురవుతాడు. కానీ, ఇక్కడ రైతే కానరాని లోకాలకు వెళ్లాడు.
Formers Death: మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామంలో రైతు వెంకన్న వడ్లను ఆరోబోశాడు. పొద్దంతా వడ్ల రాశి వద్దే ఉన్నాడు. వడదెబ్బ సోకినా పొద్దంతా వడ్ల రాశిని ఆరబెడుతూ అదే వడ్లరాశిపై పడి ప్రాణాలొదిలాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అన్నదాత మరణంతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. చూశారా? రైతు కష్టాలు.. నష్టాలే కాదు.. మరణాన్నే లెక్కచేయకుండా కాయకష్టం చేస్తాడని సమాజానికి తెలిసింది?