Rani Rampal

Rani Rampal: హాకీ వదిలిన రాణి

Rani Rampal: భారత హాకీ సూపర్ స్టార్ రాణి రాంపాల్ హాకీకి గుడ్ బై చెప్పింది. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఈ 29 ఏళ్ల హరియాణా అమ్మాయి వీడ్కోలు పలికింది. భారత్ తరఫున 254 మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించి దాదాపు 200 గోల్స్‌ చేసిన ఈ మాజీ కెప్టెన్, ఒలింపిక్‌ పోడియంపై మహిళల జట్టును చూడాలనుకుంది. కానీ, లక్ష్యానికి దగ్గరగా వెళ్లగలిగింది. రాణి రాంపాల్ గౌరవార్థం ఆమె జెర్సీ నంబర్‌ 28కు రిటైర్మెంట్‌ ప్రకటించిన హాకీ ఇండియా.. తనకు రూ.10 లక్షల నగదు బహుమతి కూడా అందజేయడం విశేషం. ఇక మూడుపూటలా కడుపు నిండా తినే స్తోమత లేని పేదరికం నుంచి ఆర్థికంగా ఆసరా లేకపోయినా అంచెలంచెలుగా ఎదిగి జాతీయ జట్టును నడిపించి భారత మహిళల హాకీకి మకుటం లేని మహారాణిగా నిలిచి ఘన కీర్తిని సొంతం చేసుకుని ఇప్పుడు ఆటను వదిలేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *