Justin Trudeau: కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని కేటీ పెర్రీలు కలిసి విందు చేసిన దృశ్యాలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. మాంట్రియల్‌లోని ఒక రెస్టారెంట్‌లో వీరు ఇద్దరూ కలిసి కనిపించడంతో, వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలకు బలం చేకూరింది. ఈ డిన్నర్‌కు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి: ట్రూడో తన భద్రతా సిబ్బందితో కలిసి మాంట్రియల్‌లోని సదరు రెస్టారెంట్‌కు చేరుకున్నారు.అక్కడ కేటీ పెర్రీతో పాటు ఒక ప్రత్యేక టేబుల్‌పై కూర్చుని విందు చేశారు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. విందు అనంతరం, వారు రెస్టారెంట్ సిబ్బందికి, ప్రత్యేకించి వంటగది సిబ్బందికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తం దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.
Also Read: Nara Lokesh: ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ జోన్..
కెనడా ప్రధాని పదవి నుంచి జస్టిన్ ట్రూడో జనవరిలో వైదొలిగారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన చాలా అరుదుగా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తున్నారు. ఈ డిన్నర్ జరిగింది, కేటీ పెర్రీ తన కొత్త ఆల్బమ్ ‘143’ ప్రమోషన్ల నిమిత్తం కెనడాలో పర్యటిస్తున్న సమయంలోనే.
జస్టిన్ ట్రూడో తన భార్య సోఫీ గ్రెగోయిర్‌తో 2023లో విడిపోయిన సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అప్పట్లో వారు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అటు, కేటీ పెర్రీ కూడా ఈ ఏడాది ప్రారంభంలో నటుడు ఓర్లాండ్ బ్లూమ్‌తో విడిపోయారు. వారికి ఒక కుమార్తె ఉంది. ఇద్దరూ తమ భాగస్వాములతో విడిపోయిన తర్వాత ఇలా కలిసి కనిపించడంతో, వీరి మధ్య కొత్త సంబంధం ఏర్పడిందనే చర్చకు తెరలేచింది. ఈ సంఘటనపై ట్రూడో లేదా కేటీ పెర్రీల నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.