Florida: ఫ్లోరిడాలో పిట్టల్లా రాలిన డ్రోన్లు.

Florida: క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఊహించని ప్రమాదం జరగింది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో డ్రోన్లు పరస్పరం ఢీకొన్న ఘటన యూఎస్‌లోని ఫ్లోరిడాలో చోటుచేసుకున్నది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా ఫ్లోరిడాలోని ఇయోలా సరస్సుపై పలు కార్యక్రమాలు నిర్వహించారు.ఏరియల్‌ లైట్ షోలో భాగంగా డ్రోన్ల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. దీంతో వాటిని చూడటానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ప్రదర్శన జరుగుతున్న టైమ్‌లో అనుకోకుండా గాలిలో ఎగురుతున్న వందల కొద్దీ డ్రోన్లు పరస్పర ఢీకొన్నాయి. అవి వేగంగా వచ్చిన కార్యక్రమాన్ని చూస్తున్నప్రేక్షకులపై పడటంతో ఏడేళ్ల బాలుడితో సహా పలువురికి గాయాలయ్యాయి.

ఇది కూడా చదవండి: KD – The Devil: కేడీ ది డెవిల్ నుండి ‘శివ శివ’ గీతం

Florida: గాయపడిన పిల్లాడి పరిస్థితి విషమయంగా ఉన్నట్లు స్థానిక వార్త సంస్థలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్లు కూలిపోతున్న దృశ్యాన్ని ఓ నెటిజన్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఓర్లాండో సిటీ భాగస్వామ్యంతో స్కై ఎలిమెంట్స్‌ సంస్థ డ్రోన్ల ప్రదర్శనను నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనుతిచ్చిందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Guinness World Record: గిన్నిస్ బుక్ లో భగవద్గీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *