KD – The Devil

KD – The Devil: కేడీ ది డెవిల్ నుండి ‘శివ శివ’ గీతం

KD – The Devil: యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా నటిస్తున్న సినిమా ‘కేడీ ది డెవిల్’. దీనిని ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. విజనరీ డైరెక్టర్ ప్రేమ్ దీనికి దర్శకుడు. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా ‘శివ శివ’ అనే గీతం విడుదలైంది. కన్నడ ఆచార వ్యవహారాలను, సంస్కృతిని, భారతీయ జానపద గేయాల్లోని అందాన్ని ఈ పాటలో చూపించారు. ఈ పాటను హిందీలో అజయ్ దేవగణ్, తమిళంలో లోకేష్ కనకరాజ్, తెలుగులో హరీష్ శంకర్ రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: kakinada: కాకినాడ కార్పొరేషన్‌లో ఆగని రౌడీ దర్బార్‌

KD – The Devil: అర్జున్ జన్యా బాణీ, విలియం డేవిడ్ కొరియోగ్రఫీ పాటలోని డెప్త్ ఇండియన్ ఫోక్ మ్యూజిక్‌ గొప్పదనాన్ని చాటి చెబుతున్నాయి. కన్నడలో ఈ పాటను ప్రేమ్, కైలాష్ కేర్ ఆలపించారు. తెలుగు, తమిళంలో విజయ్ ప్రకాష్; మలయాళంలో ప్రణవం శశి పాడారు. ఇక హిందీలో కైలాష్ కేర్, సలీమా మాస్టర్ కలిసి ఆలపించారు. కన్నడలో ఈ పాటను మంజు నాథ్ బి.ఎస్, తమిళంలో మదన్ కార్కి, తెలుగులో చంద్రబోస్, హిందీలో రక్విబ్ ఆలం, మలయాళంలో మన్‌కోంబు గోపాలకృష్ణన్ రాశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిభింబించేలా, భారతీయ జానపద గీతాల్లోని అందాన్ని చూపించేలా ఈ ‘శివ శివ’ అనే పాట సాగింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kite Flying Law: ప్రాణాలను గాల్లోకి తీసుకుపోయే గాలిపటాలు . . చట్టం ఏమి చెబుతోంది ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *