Tollywood Heroes: జాతీయ స్థాయిలో టాలీవుడ్ హీరోల హవా కొనసాగుతోంది. దానికి తాజా ఉదాహరణగా ఒర్మాక్స్ మీడియా విడుదల చేసిన గణాంకాలు నిలుస్తాయి. ఈ సంస్థ డిసెంబర్ నెలకు సంబంధించి మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్ టెన్ లో ఐదుగురు తెలుగు హీరోలే ఉండటం విశేషం. అగ్రస్థానంలో ప్రభాస్ నిలువగా, రెండో స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. ఇక మూడో స్థానంలో కోలీవుడ్ స్టార్ విజయ్ ఉన్నాడు. నాలుగో స్థానంలో షారూఖ్ ఖాన్ నిలువగా, ఐదు స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నాడు. ఇక ఆరు నుండి పది వరకూ వరుసగా అజిత్, మహేశ్ బాబు, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నిలిచారు. మొత్తం మీద ఇవాళ తెలుగు సినిమా రంగం భారతీయ సినిమాను డామినేట్ చేస్తోందనేది ఈ జాబితాను చూస్తే తెలుస్తోంది.