Garividi Lakshmi: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మీ. బుర్ర కథ చెప్పడంలో గొప్ప ప్రావీణ్యం ఉన్న ఆమె ఉత్తరాంధ్ర జనపద సంప్రదాయాల్ని సంరక్షించి, ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర ‘గరివిడి లక్ష్మీ’ పేరుతో తెరకెక్కుతోంది. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్, టి.జి. కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఆదోనిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. నటి ఆనంది టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా, అంకిత్ కొయ్య, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్ ఇతర ప్రధాన పాత్రలు ప్లే చేస్తున్నారు. ఈ సినిమాలోని ‘నల జిలకర మొగ్గ’ అనే ఉత్తరాంధ్ర జానపద గీతాన్ని శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. చరణ్ అర్జున్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను అనన్య భట్, జానకి రామ్, గౌరీ నాయుడు జమ్ము పాడారు.