Daaku Maharaaj: ప్రముఖ సంగీత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘ఆదిత్య 369’ నందమూరి బాలకృష్ణ కెరీర్ ఓ మైలురాయి. ఆ సినిమాలోని శ్రీకృష్ణదేవరాయలు ఎపిసోడ్ లోంచి పుట్టిందే ‘డాకు మహారాజ్’ కథ. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో తెలిపారు. ఈ సినిమా కోసం రెండు మూడు కథలు అనుకున్నా సంతృప్తికరంగా రాలేదని ఆ సమయంలో మెదిలిన ఆలోచనను దర్శకుడు బాబీకి చెబితే, ‘డాకు మహారాజ్’ కథను తయారు చేశారని అన్నారు. జనవరి 12న ఈ సినిమా జనం ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొంది. ఇందులో సరికొత్త బాలకృష్ణను చూస్తారని దర్శక నిర్మాతలు బాబీ, నాగవంశీ చెప్పారు. ముగ్గురు కథానాయికలూ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని, అల్లుడు, ఎంపీ భరత్ ఈ వేడుకలో పాల్గొన్నారు.