Peddi Glimpse Update

Ram Charan RC 16: ఏమున్నాడ్రా బాబు..! బాక్సాఫీస్ బద్దలే..! RC 16 నుంచి చరణ్ ఫస్ట్.. టైటిల్ వచ్చేసింది

Ram Charan RC 16: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC16’ నుంచి అప్‌డేట్ వచ్చింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ లుక్‌లో చరణ్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌లో కనిపించారు, ఇది అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన బుచ్చిబాబు సానా, ఈ సినిమాను కూడా గ్రాండ్‌గా రూపొందించేందుకు శ్రమించారు. ఇందులో రామ్ చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుందని సమాచారం. కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని, రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్‌తో నిండిపోయి ఉంటుందని టాక్.

ఇది కూడా చదవండి: Mad Square: USలో రికార్డులు సృష్టిస్తున్న “మ్యాడ్ స్క్వేర్”!

ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం మేటి సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేసినట్లు ఇటీవల రెహమాన్ వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. రామ్ చరణ్ లుక్‌పై మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చరణ్ నుంచి వస్తున్న ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ‘పెద్ది’ సినిమాతో చరణ్ మళ్లీ బిగ్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *