David Warner: యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన సినిమా “రాబిన్ హుడ్”. ఇప్పటికే ఈ సినిమా సాలిడ్ హైప్ ని సెట్ చేసుకుంది. ఈ సినిమాలో ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటిస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.
Also Read: Kannappa: కన్నప్ప హీరోయిన్ తో రొమాన్స్ పై విష్ణు వైరల్ కామెంట్స్!
ఇక మేకర్స్ ఫైనల్ గా వార్నర్ ని తెలుగు సినిమాకి చేస్తూ తన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ పోస్టర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. వార్నర్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు జెర్సీ కలర్ ఆరెంజ్ రంగులో డిజైన్ చేయడం గమనార్హం. ఇందులో వార్నర్ డైనమిక్ గా కూడా కనిపిస్తున్నారు.
దీనితో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. మరి చూడాలి ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ ఎలా ఎంటర్టైన్ చేస్తారనేది. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.