Fire accident:హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. చిట్యాల మండల కేంద్రం శివారులో రన్నింగ్‌లో ఉన్న ఓ లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. మంటల తీవ్రత పెరిగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు సిమెంట్ లోడ్‌తో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. అయితే మంటలు వ్యాపించక ముందే లారీ డ్రైవర్, క్లీనర్ బయట పడి ప్రాణాలను కాపాడుకున్నారు. నష్టం విలువ తెలియాల్సి ఉన్నది.

