Nara lokesh: వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఎన్నికల అప్పుడు కూటమి సభ్యులు పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఓ కొత్త టీంను తీసుకురాపోతుంది.మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గంజాయి అమ్మేవారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ‘ఈగల్’ గా మారుస్తున్నామని లోకేష్ చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మంది సభ్యులతో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ కమిటీల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లకు కూడా చోటు కల్పించాలని ఆదేశించారు.