అయితే, పలువురు సినీ ప్రముఖులు ఇతర రాష్ట్రాల్లో షూటింగ్‌లలో బిజీగా ఉండటం, కీలకంగా హాజరవాల్సిన మరికొందరు పెద్దల అందుబాటు లోపించడంతో, ఈ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల చెబుతునట్లు, ఈ భేటీకి కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తోంది.
ఈ సమావేశానికి హాజరయ్యే వారిలో ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్ వంటి దిగ్గజాలతో పాటు, అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, డీవీవీ దానయ్య, కేవీ రామారావు వంటి ప్రముఖ నిర్మాతలు ఉన్నారు. అలాగే నటులు నందమూరి బాలకృష్ణ, వెంకటేశ్, మంచు మనోజ్, సుమన్, ఆర్. నారాయణమూర్తి, నాని తదితరులు కూడా ఈ సమావేశానికి రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Allu Arjun: గద్దర్ అవార్డ్స్‌లో అల్లు అర్జున్ హవా – సీఎం ముంగట అంత మాట అనేసాడు ఏంటి
చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పలువురు సినీ ప్రముఖులకు ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం. మొత్తం 35 నుండి 40 మంది సినిమా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో సభను మరికొంత కాలానికి వాయిదా వేయాల్సి వచ్చింది.
సినీ పరిశ్రమకు మద్దతుగా, ప్రభుత్వంతో సమన్వయం పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడే వరకు సినీ వర్గాలు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.