Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న భారీ చిత్రం నుంచి సంచలన అప్డేట్ వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి. పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Bandla Ganesh: సెకండ్ ఇన్నింగ్స్‌కు బండ్ల గణేష్ సిద్ధం!
ప్రభాస్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు ‘ఫౌజీ’ టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో దుమ్మురేపనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన ఫెరోషియస్ లుక్ అభిమానులను ఫిదా చేస్తోంది. యుద్ధ వీరుడిగా అర్జునుడు, కర్ణుడు, ఏకలవ్యుడి స్ఫూర్తితో పాత్రను హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. యాక్షన్ సన్నివేశాలు హై ఓల్టేజ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయని చిత్ర బృందం చెప్పింది. హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తోంది. పోస్టర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
पद्मव्यूह विजयी पार्थः
पाण्डवपक्षे संस्थित कर्णः।
गुरुविरहितः एकलव्यः
जन्मनैव च योद्धा एषः॥Happy Birthday to our dearest #Prabhas garu ❤️🔥
Taking pride in presenting you as #FAUZI, this journey so far has been unforgettable and only promises to get bigger from here!
FAUZI -… pic.twitter.com/uLHVBEH7ib
— Hanu Raghavapudi (@hanurpudi) October 23, 2025

