Miryalaguda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ సమీపంలోని రైస్‌మిల్లుల వద్ద రైతులు రాస్తారోకోకు దిగారు. వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ, మిర్యాలగూడ- కోదాడ హైవేపై ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి బైఠాయించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైస్‌మిల్లర్లు సిండికేట్‌గా మారి మద్దతు ధర ఇవ్వడ లేదని రైతులు ధ్వజమెత్తారు. మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఇవ్వని రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
