Kanguva: సూర్య నటించిన ‘కంగువ’ సినిమా 14న రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో రెండున్నర ఏళ్ళపాటు నిర్మితమైన ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదల కాబోతోంది. శివ దర్శకత్వం వహించిన ఈమూవీని యువీ క్రియేషన్స్ తో కలిసి జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇక ఈ సినిమా నిర్మాతలకు మద్రాస్ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను నిలిపి వేయాలని రిలయన్స్ సంస్థ వేసిన పిటీషన్ పై కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమాను రిలీజ్ చేసుకోవచ్చంది. గతంలో రిలయన్స్ నుంచి సినిమాల నిర్మాణం కోసం జ్ఞానవేల్ రాజా 90 కోట్ల రుణం తీసుకున్నారు. వాటిలో ఇంకా 55 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే కోర్టు ఇచ్చిన గడువు తేదీ 8లోగా ఆ ఎమౌంట్ ను నిర్మాత కట్టడంతో ‘కంగువ’ రిలీజ్ కి అడ్డంకులు తొలిగి పోయాయి. దీంతో 14న తేదీన సినిమా ప్రపంచ వ్యాప్తంగా పదివేల స్ర్కీన్స్ లో రిలీజ్ కానుంది. 3డీలోనూ విడుదల కాబోతున్న ఈ సినిమాలో దిశాపటాని హీరోయిన్ గా నటించగా, బాబీ డియోల్ ప్రతినాయకుడుగా కనపించనున్నారు. సూర్య మేకోవర్ ప్రధాన ఆకర్షణ కానున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మరి ‘కంగువ’ను ప్రేక్షకులు యూనివర్శల్ గా ఆదరిస్తారేమో చూద్దాం.