Pawan Kalyan: ఈరోజు గుంటూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. తమది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఐపీఎస్ అధికారులను ఎవరైనా బెదిరిస్తే వాళ్లపైనా కేసులు పెడతాం అని హెచ్చరించారు. పరోక్షంగా వైసీపీ నేతలకి వార్నింగ్ ఇచ్చారు. రాష్టంలో వున్నా మహిళలకి భద్రత విషయం లో మొదటి ప్రాధాన్యత ఇస్తాం అన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని చెప్పారు.