Lalu Family in Tattoos: బిహార్ కు చెందిన ఓ వ్యక్తి….ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని విన్నూతంగా చాటుతున్నారు. ముజఫర్ పుర్ కు చెందిన రంజిత్ నాయక్….లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన కుమారులు, మాజీ సీఎం రబ్రీ దేవీల పచ్చబొట్లను తన శరీరంపై వేయించుకున్నారు. డ్రై క్లీనింగ్ షాప్ కు యజమాని అయిన రంజిత్ ….లాలూ ప్రసాద్ యాదవ్ ను తన దేవుడిగా కొలుస్తారు. ఆర్జేడీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఆయన హాజరవుతారు.
ఇది కూడా చదవండి: Balmuri Venkat: గాంధీ ని నోటికొచ్చినట్టు తిట్టిన నటుడు శ్రీకాంత్ భరత్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బల్మూరి వెంకట్
అక్కడ పార్టీ జెండా పట్టుకుని…నినాదాలు చేస్తూ ఉంటారు. 2024లో లాలూ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా..ఆయనపై ఉన్న ప్రేమను చూపించేందుకు తన శరీరంపై టాటూలు వేయించాలనుకున్నారు. తన ఛాతి కుడి వైపున లాలూ ప్రసాద్ , ఎడమ వైపున రబ్రీ దేవి పచ్చబొట్లను వేయించుకున్నారు. కుడి చేతికి తేజ్ ప్రతాప్ , వీపు భాగం దగ్గర లాలూ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ టాటులు వేయించుకున్నాడు. ఇందుకోసం 12 వేల రూపాయలు ఖర్చు చేసినట్లు రంజిత్ తెలిపారు. శ్రీరాముడు, లక్ష్మణుడు లాగా తేజ్ ప్రతాప్, తేజస్వి ఇద్దరు ఐక్యమత్యంగా కలిసి ఉండాలని…రంజిత్ ఆకాంక్షించారు.