Fake Medical Degree: సూరత్‌లో నకిలీ వైద్య పట్టాలు ఇస్తున్న ముఠా గుట్టును గుజరాత్ పోలీసులు రట్టు చేశారు. తక్కువ చదువుకున్న నిరుద్యోగులకు రూ.70 వేలకు నకిలీ పట్టాలు ఇప్పించేందుకు ఈ ముఠా గత 32 ఏళ్లుగా పని చేస్తోంది. రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకునేందుకు రూ.5వేలు కూడా వసూలు చేసేవాడు.
ఈ డిగ్రీ తీసుకున్నవారిలో ఒకరు ఎనిమిదో తరగతి మాత్రమే చదివిన వారు ఉండడం షాకింగ్. ఒక నకిలీ వైద్యుడు షమీమ్ అన్సారీ 8వ తరగతి చదివి డాక్టర్ గిరీ వెలగబెట్టేస్తున్నాడు. అతని తప్పుడు చికిత్స కారణంగా కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయి మరణించింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 13 మందిని అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Maharashtra Assembly Session: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 7 నుంచి
Fake Medical Degree: ముఠాలోని ఇద్దరు ప్రధాన నిందితులు డాక్టర్ రమేష్ గుజరాతీ, బీకే రావత్ నుంచి వందలాది దరఖాస్తులు, సర్టిఫికెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు 1200 మందికి నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు పందేసరలోని 3 క్లినిక్‌లపై దాడి చేశారు. వారి నుండి బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతి మెడిసిన్, సర్జరీ సర్టిఫికేట్లు లభించాయి. వీటిని సూరత్‌కు చెందిన ఇద్దరు వైద్యులు జారీ చేశారు. విచారణలో, వారికి ఇచ్చిన సర్టిఫికేట్‌ను గుజరాత్ ప్రభుత్వం గుర్తించలేదని తేలింది . పోలీసులతో కలిసి దాడికి వెళ్లిన ప్రత్యేక బృందం కూడా ఆ డిగ్రీ నకిలీదేనని తేల్చిచెప్పింది.

