Fake Doctor: గ్రామీణులు, వృద్ధులు అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు ఓ నకిలీ డాక్టర్. ఎటువంటి అర్హతలు లేకున్నా తాపీ మేస్త్రి అయిన తండ్రి సూపర్ బ్రెయిన్ తో డాక్టర్ అవతారం ఎత్తి రోగులకు వైద్యం చేసేస్తున్నాడు. వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్లు, నడుం నొప్పి లకు జాయింట్లలో ఇంజక్షన్లు చేస్తూ వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Horoscope: ఈ రాశి వారు తలచిన కార్యం చేస్తారు
Fake Doctor: పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండ మండలం సోమరాజు చెరువు గ్రామంలో నకిలీ వైద్యుడు దందా పై వివరాలు సేకరించేందుకు వెళ్లిన మహా న్యూస్ ప్రతినిధులను మెడికల్ ఏజెన్సీ మాఫియాతో భయపెట్టేందుకు, ప్రలోభాలకు గురి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు నకిలీ డాక్టర్ తండ్రి. విచ్చలవిడి స్టెరాయిడ్ ఇంజక్షన్లు తో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, డాక్టర్ వివరణ ఇవ్వాలని కోరగా… మా అబ్బాయి డాక్టర్ చదుకున్నాడు, పాస్ కాలేదని ఆర్ఎంపీ గా చేస్తున్నాడని ఆ తండ్రి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జిల్లా వైద్య, ఔషధ అధికారులు ఇటువంటి నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.