Exise Ci Video: కార్యాలయంలో పనిచేసే అటెండర్‌పై ఓ సీఐ చేయి చేసుకున్నారు. ఏకంగా చెప్పుతో తోటి ఉద్యోగుల ఎదుట కొట్టారు. తన పేరు చెప్పుకొని అక్రమ వసూళ్లకు పాల్పడిన కారణంగా దాడి చేసినట్టు సీఐ చెప్పుకున్నారు. ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. అక్కడున్న కొందరు దాడి ఘటనను తీసిన వీడియో సోషల్ మీడియా గ్రూపులలో వైరల్‌గా మారింది.
Exise Ci Video: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో సీఐ హసీనా భాను తన కార్యాలయంలో పనిచేసే అటెండర్‌ను చెప్పుతో కొట్టిన దాడి ఘటన రెండు రోజుల క్రితమే జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తొలుత వారిద్దరి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకున్నది. తన పేరు చెప్పి వైన్ షాపుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ అటెండర్‌పై సీఐ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Exise Ci Video: ఈ విషయమై తమకేమీ తెలియదని సదరు అటెండర్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ సమయంలో ఆగ్రహానికి లోనైన సీఐ హసీనాభాను అటెండర్‌ను చెప్పుతో కొట్టారు. దీంతో సీఐ భాను చిక్కుల్లో పడ్డారు.