RC 16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16 వ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్ గురించి చర్చ జరుగుతోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా ఉండబోతోంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే కెమెరామెన్ రత్నవేలు లీక్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ అంతా కుస్తీ ఆటతో కథ నడుస్తుందని అంటున్నారు.
ఈ క్రమంలోనే క్రికెట్-కుస్తీ రెండూ కలిసి వచ్చేలా టైటిల్ పెట్టాలని ఆలోచనలో ఉన్నారట మేకర్స్. గతంలో పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉండగా తాజాగా పవర్ క్రికెట్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!
Dhop – Video Song