Konda surekha: మంత్రి కొండ సురేఖకు భారీ షాక్ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో కొండా సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌ను ప్రజా ప్రతినిధుల కోర్టు కాగ్నిజన్స్‌లోకి తీసుకుంది.
దీంతో.. మంత్రి కొండా సురేఖ 12 తేదీన హాజరు కావాలని ఆదేశం ఇచ్చింది.నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్‌పై నాగార్జున నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పరువునష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. నాగార్జున, యార్లగడ్డ సుప్రియ,మెట్ల వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన అనంతరం కోర్టు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని కొండా సురేఖను ఆదేశించింది. వీడియో క్లిప్పింగ్స్‌ను ప్రామాణికంగా తీసుకుంది.కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.