Ethanol Factory: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డుకున్న 12 మంది రైతులకు గద్వాల కోర్టు రిమాండ్ విధించింది. మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసినట్టు స్థానిక ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. 40 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 28 మందిని విడుదల చేయగా, 12 మందికి కోర్టు రిమాండ్ విధించింది.
Ethanol Factory: ఏపీకి చెందిన వారు పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు నిర్మాణ పనులను చేపట్టేందుకు బుధవారం వాహనాలతో సిబ్బంది పోలీసుల సహాయంతో వచ్చారు. ఈ సమయంలో సమీపంలోని 12 గ్రామాలకు చెందిన రైతులు, వారి కుటుంబాలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన తెలిపారు. ఈ సమయంలో అక్కడి వాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం పోలీసులు రైతులపై విచక్షణారహితంగా లాఠీలతో దాడి చేశారని, ఈ దాడిలో పలువురు రైతులకు గాయాలయ్యాయయని రైతులు తెలిపారు.
Ethanol Factory: రైతుల దాడి ఘటనలో పాల్గొన్న రైతులను గుర్తించేందుకు 40 మందిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని విచారించిన పోలీసులు 12 మందిని కోర్టుకు రిమాండ్ చేయగా, 28 మందిని విడిచి పెట్టారు. మరో ఐదుగురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీడియోగ్రఫీని పరిశీలిస్తున్నామని బాధ్యులు తేలితే వారిని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

