EPFO

EPFO: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు.. ఈసారీ 8.25శాతమే.!

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ EPF ఖాతాల్లో నిల్వలపై 8.25% వడ్డీ రేటు కొనసాగించనుంది. శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే వడ్డీ రేటు 2023-24 సంవత్సరానికి కూడా అమలులో ఉంది.

Also Read: AP Budget: 3.22 ల‌క్ష‌ల కోట్ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్.. వాటికోస‌మే అధిక కేటాయింపులు

సీబీటీ సిఫార్సును కేంద్ర ఆర్థికశాఖకు పంపించనుండగా, ఆమోదం లభించిన తర్వాత EPFO అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆ తర్వాత ఈ వడ్డీ మొత్తాన్ని 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో జమ చేయనుంది.

గతంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ EPF వడ్డీ రేటును 8.1%కి తగ్గించారు, ఇది 1977-78 తర్వాత అత్యల్ప స్థాయి. అయితే, గత రెండు సంవత్సరాలుగా స్వల్పంగా పెంచి ఇప్పుడు 8.25% వద్ద స్థిరంగా కొనసాగించడం గమనార్హం.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Dreams: ఈ రకమైన కల పదే పదే వస్తే జాగ్రత్తగా ఉండండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *