Encounter: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల కోసం నిన్నటి నుంచే గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి. పూంచ్, బారాముల్లా అడవులను శోధిస్తూ ఉగ్రవాదులు ఫారెస్ట్‌లో నక్కి ఉండవచ్చనే అనుమానంతో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదుల ఏరివేసే వరకూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
Encounter: ఇదిలా ఉండగా, జమ్ముకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లోని ఓ చోట ముష్కరులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అక్కడికి చేరుకున్నాయి. ఆర్మీ బలగాల రాకను పసిగట్టిన ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. ప్రస్తుతం బసంత్‌గఢ్‌లో భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నది. భద్రతా దళాలు ముష్కరులు ఉన్నచోటు వైపు ఎదురు కాల్పులను మొదలుపెట్టారు. ఈ దాడుల్లో ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) సంయుక్తంగా పాల్గొన్నాయి.