Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజి’. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల పవన్ ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ముంబై సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో పవన్‌తో పాటు విలన్‌గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీపై కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది. కానీ, ఇమ్రాన్ అనారోగ్యం కారణంగా షూటింగ్‌కు రాలేకపోయారు. ఆయనకు డెంగ్యూ లక్షణాలు కనిపించినట్లు సమాచారం, దీంతో ఆయన తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా అభిమానుల అంచనాలను మరింత పెంచుతోంది.