Elephant Attack:

Elephant Attack: ఏనుగుల గుంపు బీభ‌త్సం.. ఐదుగురు భ‌క్తుల మృతి.. ప‌వ‌న్ కల్యాణ్ దిగ్భ్రాంతి.. 10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

Elephant Attack:ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అన్న‌మ‌య్య జిల్లాలో ఏనుగుల గుంపు బీభ‌త్సం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు భ‌క్తులు అక్క‌డిక‌క్కడే మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది. శివాల‌యానికి వెళ్తున్న భ‌క్తుల‌పై ఏనుగులు దాడి చేశాయి. ఒకే గ్రామానికి చెందిన భ‌క్తులు చ‌నిపోవ‌డంతో ఆ ఊరిలో విషాదం అలుపుకున్న‌ది. ఈ ఘట‌న‌పై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దిగ్భ్రాంతిని వ్య‌క్తంచేశారు. వెంట‌నే మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య చికిత్సలు అందించాల‌ని ఆదేశాలు జారీచేశారు.

Elephant Attack:ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అన్న‌మ‌య్య జిల్లాలోని ఓబుల‌వారిప‌ల్లె మండ‌లం వై కోట స‌మీపంలోని గుండాలకోనలోని శివాల‌యం అక్క‌డ ప్ర‌సిద్ధి. ఏటా ఇక్క‌డికి శివ‌భ‌క్తులు వ‌స్తుంటారు. బుధ‌వారం శివ‌రాత్రి కావ‌డంతో సోమవారం రాత్రే గుండాలకోన అట‌వీప్రాంతం నుంచి 14 మంది శివ‌భ‌క్తులు స్వామివారి ద‌ర్శ‌నానానికి కాలిన‌డ‌క‌న బ‌య‌లుదేరి వెళ్లారు.

Elephant Attack:శివాల‌యానికి వెళ్తున్న శివ‌భ‌క్తుల‌పై మార్గ‌మ‌ధ్యంలో ఏనుగుల గుంపు దాడిచేసింది. ఈ సంద‌ర్భంగా ఐదుగురు శివ‌భ‌క్తుల‌ను ఏనుగులు తొక్కిచంపాయి. 14 మందిలో 8 మంది భ‌క్తులు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే వీరిలో ఇద్ద‌రికి గాయాలు కాగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులంతా ఉర్ల‌గ‌డ్డ‌పోడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు, అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని అక్క‌డి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

మృతుల కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌లు.. క్ష‌త‌గాత్రుల‌కు 5 ల‌క్ష‌లు
Elephant Attack:గుండాలకోన ఏనుగుల దాడి ఘ‌ట‌నపై ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. మృతుల కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌లు, క్ష‌త‌గాత్రుల‌కు రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక‌సాయం అందించాల‌ని ఆదేశించారు. మ‌హాశివరాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అట‌వీప్రాంతాల్లో ఉన్న ఆల‌యాల‌ను ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు త‌గిన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. మృతుల కుటుంబాల‌ను, క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించి, భ‌రోసా ఇవ్వాల‌ని ప్ర‌భుత్వ విప్‌, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అర‌వ శ్రీధ‌ర్‌కు సూచించారు.

Elephant Attack:గుండాల‌కోనలో ఉన్న మ‌ల్లేశ్వ‌రాల‌యంలో మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా వేడుక‌లు జ‌రుపుకుంటారు. పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ఈసారి మంగ‌ళ‌వారం 5,000 మందికి అన్న‌దానం కోసం ఏర్పాట్లు కూడా జ‌రిగాయి. ఇదే స‌మ‌యంలో సోమ‌వారం రాత్రే ఏనుగుల దాడి జ‌ర‌గ‌డంతో ఆల‌య ప‌రిస‌రాల్లో విషాదం అలుముకున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *