Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరు లో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. తమ ఇంట్లో రెడ్డప్ప కుటుంబం నిద్రిస్తున్న సమయంలో పైన రేకులను పెకలించివేస్తున్న సౌండ్ తో అప్రమత్తమై చూడగా ఒంటరి ఏనుగు కనిపించింది. దీంతో భయపడి నిద్రిస్తున్న మా పిల్లల్ని తీసుకొని ఇంటి బయట పరుగులు తీశామన్నారు. ఇంటి గోడలు కూల్చి అక్కడున్నటువంటి రాగులు వరిని ఆరగించిందన్నారు. మేము కనుక అక్కడనుండి లేవకపోయి ఉంటే గోడ కూలి మా ప్రాణాలు మా ఇద్దరు పిల్లలు ప్రాణాలు పోయిండేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరి ఏనుగును తరమడానికి బాణాసంచా కాల్చిన అరిచిన ఏమాత్రం కదలలేదని తెలిపారు.అధికారులకు సమాచారం అందించాము మాకు ఏనుగుల నుండి ప్రాణాపాయం ఉంది ప్రభుత్వం నుండి నష్ట పరిహారం ఇప్పించాల్సిందిగా కోరారు.
ఇది కూడా చదవండి: Payal Shanker: అసెంబ్లీకి ట్రాక్టర్ నడుపుతూ వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే
Chittoor: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుకుమార్ మాట్లాడుతూ…బండమీద జరారిపల్లి గ్రామస్తుడు రెడ్డప్ప అందించిన సమాచారం మేరకు, ఉదయం ఘటన ప్రాంతానికి చేరుకుని మొత్తం పరిశీలించాము. వంట ఏనుగు ఇంటి గోడను కూల్చి వేసి వరి రాగి తిని సమీపంలోని అటువైపు ప్రాంతానికి వెళ్లిపోయింది. ఘటనపై పై స్థాయి అధికారులకు సమాచారం అందించాము బాధితులకు నష్టపరిహారం అందేలా చూస్తామని, భవిష్యత్తులో ఏనుగులు ఇటుపక్క రాకుండా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు.