TGPSC:ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1368 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 783 పోస్టుల భర్తీ కోసం ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
TGPSC:ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 1368 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి.
TGPSC:ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఫొటోను కూడా తీసుకురావాల్సి ఉంటుంది. వారితోపాటు బ్లాక్ లేదా బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్‌పైన ఫొటోను అంటించి ఉండాలి. ఏదైనా ఫొటో గుర్తింపు ఒరిజినల్ కార్డును పరీక్ష కేంద్రానికి తప్పక తీసుకొని రావాల్సి ఉంటుంది.