Payal Shanker: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సభలకు వినూత్న తరహాలో బీజేపీ ఎమ్మెల్యే ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చాడు. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ అయిన పాయల్ శంకర్ మహానగర వీధుల్లో గుండా ట్రాక్టర్ నడుపుకుంటూ అసెంబ్లీ వరకు వచ్చారు. అసెంబ్లీ ఎదుట నినాదాలు చేశారు. రైతు సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వాహనదారులు, రోడ్డు పై వెళ్లేవారు ఆసక్తిగా చూడసాగారు.