Tharun Bhascker: దర్శకుడుగా ‘పెళ్ళిచూపులు, ఈ నగరానికిఏమైంది’తో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ ఇటీవల ‘కీడా కోలా’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం మలయాళంలో రూపొంది హిట్ అయిన ‘జయ జయ జయ జయహే’ సినిమాను తెలుగులో ‘ఓం శాంతి శాంతి శాంతి’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తోంది. తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి తరుణ్ భాస్కర్ లుక్ ని రివీల్ చేశారు. ఇదిలా ఉంటే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడట తరుణ్ భాస్కర్. ఇదిలా ఉంటే రీరిలీజ్ లో ఆకట్టుకన్న ‘ఈ నగరానికి ఏమైంది’ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగంలో నటించిన విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను, సిమ్రాన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్, సుశాంత్ రెడ్డి ఈసీక్వెల్ లోనూ నటిస్తారట. ఈ సీక్వెల్ ను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ ఎర్రబోలు నిర్మిస్తారట. మరి అటు మలయాళ రీమేక్ ఇటు సీక్వెల్ తో తరుణ్ భాస్కర్ ఎలాంటి విజయాలు అందుకుంటాడో!
