ED Rides:

ED Rides:హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ ఈడీ దాడుల క‌ల‌క‌లం

ED Rides: హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) దాడుల క‌ల‌క‌లం రేగింది. న‌గ‌రంలోని విదేశీ న‌గ‌దు మార్పిడి (ఫారెక్స్‌) సంస్థ‌ల‌పై ఈడీ అధికారులు దాడుల‌కు దిగారు. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేకుండా, లైసెన్సులు పొంద‌కుండా నిర్వ‌హిస్తున్న సంస్థ‌ల‌పై వ‌చ్చిన ఫిర్యాదుల మేర‌కు ఈ దాడులు జ‌రిగాయ‌ని తెలుస్తున్న‌ది.

ED Rides: ఇప్ప‌టికే గ‌తంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు ఆయా సంస్థ‌ల‌పై దాడులు జ‌రిపారు. ఆ స‌మ‌యంలోనే ఆయా సంస్థ‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌పడ్డాయి. మ‌ళ్లీ ఈడీ అధికారులు కూడా ప్రిజ‌మ్‌, గ‌రుడ‌, విక్ట‌రీ, విమ‌ల్‌నాథ్ ఫోరెక్స సంస్థ‌ల్లో ఈడీ అధికారులు తాజాగా త‌నిఖీలు చేప‌ట్టారు. ఈడీ దాడుల్లో కూడా అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌పడ్డాయి.

ED Rides: ఆర్బీఐ అనుమ‌తులు లేకుండానే బోగ‌స్ ప‌త్రాల‌తో సంస్థ‌లు న‌డిపిస్తున్న‌ట్టు బ‌య‌ట‌ప‌డిందని తెలుస్తున్న‌ది. ఆయా సంస్థ‌లు అక్ర‌మంగా న‌గ‌దు మార్పిడి వ్యాపారాన్ని కొన‌సాగిస్తున్నాయ‌ని ఈడీ ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. ఆ సంస్థ‌లు ఫెమా నిబంధ‌న‌ల‌ను కూడా ఉల్లంఘించాయ‌ని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ మేర‌కు దాడుల్లో న‌కిలీ ప‌త్రాలు, ల్యాప్‌టాప్‌, మొబైల్ ఫోన్లు, రూ.11.99 ల‌క్ష‌ల న‌గ‌దు, రూ.26.77 ల‌క్ష‌ల విదేశీ మార‌కం స్వాధీనం చేసుకున్న‌ట్టు ఈడీ అధికారులు వెల్ల‌డించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *