Betting Apps Case: తెలంగాణలోని బెట్టింగ్ యాప్‌ల వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ కేసులో Enforcement Directorate (ఈడీ) భారీ దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే 29 మంది సినీ సెలబ్రిటీలు, 4 కంపెనీలపై కేసులు నమోదయ్యాయి. అందులో టాలీవుడ్ హీరోలు, యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు.
ఈ కేసులో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, ప్రణిత, విష్ణు ప్రియ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. సైబరాబాద్ పోలీసులు గతంలో నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు విచారణ ప్రారంభించింది.
ఎంత డబ్బు తీసుకున్నారో లేదన్న అనుమానం!
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు వీరు భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే వారి ఆదాయ పన్ను రిటర్న్స్‌లో ఈ లెక్కలు కనిపించకపోవడంతో ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
వీరేమంటున్నారు?
ఈ వ్యవహారంపై విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి ఇప్పటికే స్పందించారు. వారు నిషేధిత యాప్‌లకు కాకుండా నైపుణ్య ఆధారిత గేమ్‌లకు మాత్రమే ప్రచారం చేశామని స్పష్టం చేశారు. అలాగే తాము చేసిన ఒప్పందాలు ఇప్పటికే ముగిసిపోయినవని వివరించారు. విజయ్ దేవరకొండ ‘ఏ23’ అనే కంపెనీతో ఒప్పందం ముగిసినట్టు చెప్పగా, రానా ఒప్పందం 2017లోనే ముగిసిందని తెలిపారు. ప్రకాశ్ రాజ్ కూడా తన ఒప్పందం 2016లోనే ముగిసిందన్నారు.
ఇది కూడా చదవండి: Siddu Jonnalagadda: మరో కిరాక్ టైటిల్ తో వస్తున్న స్టార్ బాయ్ సిద్ధు..
ఎఫ్‌ఐఆర్‌లో ఎవరి పేర్లు ఉన్నాయంటే?
ఈ కేసులో ప్రముఖ సినీ నటులు, యాంకర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, వైసీపీ ప్రతినిధి శ్యామల, బుల్లితెర నటులు శ్రీముఖి, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి, శోభా శెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత తదితరులపై కేసులు నమోదు అయ్యాయి.
కేసులో నమోదు అయిన సెక్షన్లు:
-
భారత న్యాయ వ్యవస్థ చట్టం 318(4), 112, 49
-
తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3, 3(ఎ), 4 సెక్షన్లు
-
ఐటీ చట్టం 66డి సెక్షన్
అసలు సమస్య ఏమిటంటే?
చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలంటూ ఈ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనికిగాను వారు భారీగా పారితోషికాలు, కమీషన్లు తీసుకున్నారని సమాచారం. ఈ యాప్‌ల కారణంగా ప్రజలు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నారన్న విషయాన్ని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు.