Ec: ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ (ఈసీ) తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు వచ్చిందని తామూ గుర్తించలేదని వెల్లడించింది.
ఈసీ ప్రకారం, “ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అనుమానాలుంటే, దానికి సంబంధించి సరైన ఆధారాలు సమర్పించాలి. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, కోర్టులో కూడా ఛాలెంజ్ చేయవచ్చు,” అని పేర్కొంది.
రాహుల్ గాంధీ ఎన్నికల ప్రక్రియపై అనేక సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

