Eatala Rajendar: అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి బీజేపీలో వింత పరిస్థితి కొనసాగుతున్నది. కీలక నేతలంతా కాంగ్రెస్ ప్రభుత్వంతో ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డిపై కొంతమేరకు మెతకవైఖరి ప్రదర్శిస్తుండగా, ఆ పార్టీలో కీలక నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తొలి నుంచి తీవ్రమైన దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. హైడ్రా, మూసీ ప్రాజెక్టు పేరిట ఇండ్ల కూల్చివేతలను బీజేపీలోని కొందరు నేతలు బహిరంగంగానే సమర్థించగా, ఈటల రాజేందర్ మాత్రం తీవ్రస్థాయిలో వ్యతిరేకించి, బాధితుల పక్షాన నిలిచారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ నిన్న రాష్ట్ర అప్పుల విషయంలో సీఎంను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తనదైన శైలిలో విమర్శలను ఎక్కుపెట్టిన ఈటల తాజాగా మరోసారి సీఎం రేవంత్‌రెడ్డిపై, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Eatala Rajendar: ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దని, ఆడితో ఖబడ్దార్.. అంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి తలాతోక లేదని, ఇది ఎన్నో రోజులు ఉండదని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ తుగ్లక్ ప్రభుత్వమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ తుగ్లక్ ముఖ్యమంత్రి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Eatala Rajendar: సీఎం రేవంత్‌రెడ్డిపై మునుపెన్నడూ లేనంతగా ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి శాడిస్టు అని, సైకో అని అందుకే ప్రజలను ఏడిపిస్తున్నాడని ఈటల విమర్శించారు. సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలని, పిచ్చి వేషాలు వేయడం మానుకోవాలని హెచ్చరించారు.