Dwarampudi: కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి చెందిన వీరభద్ర రొయ్యల ఎగుమతి ప్లాంట్. గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డంపెట్టుకుని నిబంధనలేమీ పాటించకుండా అడ్డగోలుగా వ్వవహరించారు.చుట్టుపక్కల ప్రాంతాన్ని కాలుష్య కొర్రలుగా మార్చేశారు. అధికారులు కనీసం కన్నెత్తి చూడడానికే భయపడేలా చేశారు.కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగడుగునా అనేక ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు వాటిని సరి దిద్దుకోవడానికి వ్యవధి ఇచ్చినా లెక్కచేయలేదు. దీంతో ఈ రొయ్యల ఫ్యాక్టరీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉక్కుపాదం మోపింది. ఇష్టారాజ్యంగా నడుస్తున్న ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేసింది.
అంతా మా ఇష్టం.. అడిగేదెవరు…
కాకినాడ జిల్లా కరప మండలం గురజకాపల్లిలో ద్వారంపూడి కుటుంబం వీరభద్ర రొయ్యల ప్యాక్టరీ నడుపుతోంది. సేకరించి తెచ్చిన రొయ్యలను ఇక్కడ ప్రాసెస్ చేసి ఎగుమతి చేస్తారు. ఈ కంపెనీలో వ్యర్థజలాల కాలుష్యం భారీగా ఉండని కొన్నేళ్లుగా స్థానికులు, రైతులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన కొందరు రైతులు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెలికాప్టర్ చెక్ చేసిన ఎలక్షన్ ఆఫీసర్స్
గ్రీన్బెల్ట్ లేదు.. మురుగునీటి శుద్ధి లేదు..
Dwarampudi: ఈ నివేదిక ప్రకారం ఫ్యాక్టరీలో రొయ్యల శుద్ధి సమయంలో వెలువడే వ్యర్థజలాలను శుద్ధి చేయకుండా నేరుగా సమీప పంట కాలువలు,డ్రైనలోకి వదిలేస్తున్నారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) నిబంధనలు ఎక్కడా అమలు చేయకుండా పరిశ్రమ నడుపుతున్నారు.13 ఎకరాల్లో పరిశ్రమకు సంబంధించి గ్రీనెల్ట్ నిర్వహించాల్సి ఉండగా అసలు అలాంటిదేమీ ఏర్పాటు చేయలేదు. వ్యర్థ జలాల శుద్ధీకరణకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయకుండా నేరుగా వాటిని డ్రెయిన్లు,వంట కాలువల్లో కలిపేస్తున్నాడు.పీసీబీ వెబ్సైట్కు ఆన్లైన్ ద్వారా సమర్పించిన వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయి.
పీసీబీ అనుమతులు లేకుండా నాన్ బడిఆర్ బాయిలర్లు, ఐన్స్టాంట్ నిర్వహిస్తున్నారు. ఈ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఆగస్టు 6న నోటీసులు ఇచ్చారు. అనంతరం నవంబరు 8 నాటికి 14 ఎకరాలు కొనుగోలు చేసి గ్రీన్హౌ ల్ట్ ఏర్పాటు చేస్తామని, అదనపు సామర్థ్యంతో కూడిన ఈటీపీ నిర్మిస్తా మని పీసీబీని సదరు కంపెనీ గడువు కోరింది కానీ, ఆ కంపెనీ అవేమీ చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఈ ప్లాంట్ను పూర్తిగా మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీచేశారు.