Nitin Gadkari: మహారాష్ట్రలోని లాతూర్‌లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. లాతూర్ జిల్లా ఔసా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అభిమన్యు పవార్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఆయన మంగళవారం వచ్చారు. ఇంతలో ఎన్నికల సంఘం బృందం అక్కడికి చేరుకుని ఆయన హెలికాప్టర్, బ్యాగ్ తనిఖీ చేసింది.
గతంలో, మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాకరే హెలికాప్టర్‌ను 24 గంటల్లో రెండుసార్లు చెక్ చేశారు. ఉస్మానాబాద్‌లోని అవుసా స్థానానికి ఉద్ధవ్ మంగళవారం ప్రచారానికి వచ్చారు. ఈ సమయంలో ఎన్నికల సంఘం ఉద్యోగులు ఆయన హెలికాప్టర్‌ను చెక్ చేశారు. అంతకుముందు నవంబర్ 11 న, యవత్మాల్‌లోని వానీ విమానాశ్రయంలో ఆయన బ్యాగ్ చెక్ చేయడం జరిగింది.
ఇది కూడా చదవండి:
Nitin Gadkari: ఈ సందర్భంగా ఉద్ధవ్ ఎన్నికల సంఘం చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రధాని మోదీ హెలికాప్టర్‌లో సోదాలు జరిగినప్పుడు ఒడిశాలో ఓ అధికారిని సస్పెండ్ చేశారు. మీరు నా బ్యాగ్‌ని తనిఖీ చేసారు. ఫర్వాలేదు కానీ, , మోడీ – షాల బ్యాగ్‌లు కూడా తనిఖీ చేయాలి అంటూ ఎలక్షన్ ఆఫీసర్స్ కు సూచించారు. అంతేకాకుండా.. అధికారులు బ్యాగులు తనిఖీ చేస్తున్న వీడియోను ఉద్ధవ్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్నికల కమిషన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘इलेक्शन कमिशन‘ अजून किती खालच्या थराला जाणार? pic.twitter.com/3PKSwnEktU
— ShivSena – शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) November 12, 2024